నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వ విద్యాలయం లోనీ ఆర్ట్స్, సైన్స్ కళాశాల పరిసరాలలో భాషా విభాగాల (హిందీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్)ఆధ్వర్యంలో పనస, బత్తాయి మొక్కల విత్తనాలను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. మామిడాల ప్రవీణ్ హాజరై పనస, బత్తాయి మొక్కల విత్తనాలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాషా శాస్త్ర విభాగాలు పండ్ల మొక్కల విత్తనాలను నాటడం గొప్ప విషయ మని, మొక్కలు మానవాళి కి ఉపయోగపడే ఆక్సిజన్ ను అందిస్థాయనీ తద్వారా మానవుల ఆరోగ్యా లు బాగుంటాయని అన్నారు. ప్రతీ ఒక్కరు వర్షాకాలంలో మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ఉపయోగ పడతాయని తెలిపారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాషా శాస్త్ర విభాగాల అధ్యాపకులు ప్రొఫెసర్. కనకయ్య, ప్రొఫెసర్. మూసా ఖురేషి,డా. యం. డి. జమీల్ అహమ్మద్ ,డా. తాహేర్, డా. అశోక్ చౌహాన్, నాన్ టీచింగ్ సిబ్బంది సుధీర్, సురేశ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
