బతుకమ్మ, నిజామాబాద్ క్రైం..
ఈ నెల 16న ఉదయము 7 గంటల నుండి మధ్యాహ్నము 1 గంటల వరకు “మిలాద్-ఉన్-నబీ” ఉన్నందున కొన్ని మార్గాలలో ఈ క్రింది విధంగా నగరంలో వాహనాల దారి మళ్లింపు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. బోధన్ వైపు నుండి వచ్చే వాహనాలు అర్సపల్లి చౌరస్తా, అర్సపల్లి రైల్వే గేట్, న్యూ కలెక్టరేట్, కాలూర్ చౌరస్తా, ఖాజా హోటల్, బైపాస్, ఎన్ టీ ఆర్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాలని సూచించారు. ఆలాగే బోధన్ వైపు వెళ్ళడానికి వాహనాలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, శివాజీ చౌక్, నిజామ్ కాలనీ, అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బోధన్ వైపు వెళ్లాలన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తూ ట్రాఫిక్ పోలీస్ లకు సహకరించగలరని కోరారు.
