30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కార్బన్ క్రెడిట్ రూపంలో ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం లో భాగంగా నాటబడి బతికున్న మొక్కల కు కార్బన్ క్రెడిట్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుందని దొనకల్ పంచాయతీ కార్యదర్శి స్వప్న అన్నారు. గ్రామపంచాయతీ ప్రభుత్వ స్థలంలో వ్యక్తిగత భూములలో 2022-23 నుండి 2024-25 సంవత్సరంలో నాటిన మొక్కలకు బెన్ఫిషరీ, నాన్ బెనిఫిషరీ ప్లాంటేషన్ ద్వారా ఈ సంవత్సరంలో నాటిన మొక్కలను వచ్చే సంవత్సరం పరిగణలోకి తీసుకొని ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని  పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని దొనకల్, పాలెం గ్రామాల్లో కార్బన్ క్రెడిట్ కార్యక్రమం ద్వారా గ్రామసభ నిర్వహించి స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, ఉపాధి క్షేత్ర సహాయకుడు ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article