ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గ్రామాలలో నాగ దేవతకు పాలాభిషేకం చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు.గ్రామాలలో ఉన్న మహిళలు అధిక సంఖ్యలో నాగదేవతకు పుట్టలలో పాలు పోశారు. శివుడి యొక్క ప్రత్యేకత శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కతో చేసిన నాగ పడిగెలకు భక్తులు ఆరాధిస్తుంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే “నాగపంచమి”నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెప్తున్నారు.. ఇలాంటి అరుదైన సంవత్సరంకు ఒకసారి రావడం చాలా అందంగా ఆనందకరంగా ఉంటుందని మహిళలు పేర్కొంటున్నారు.
