24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్లారెడ్డి- కామారెడ్డి రోడ్డుపై రైతుల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

రైతులకు న్యాయం చేయని తహసీల్దార్ వద్దు అంటూ నినాదాలు

కామారెడ్డి, బతుకమ్మ : తమ భూములకు పట్టాలు మంజూరు చేయడంలో తహసీల్దార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు సోమవారం ఎల్లారెడ్డి- కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. రైతులకు న్యాయం చేయని తహసీల్దార్ మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు. రైతులకు తెలిపిన వివరాలు.. గతంలో పనిచేసిన తహసీల్దార్ 372,  373, 374 సర్వే నంబర్లలోని 115 మంది రైతులం 40 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నామన్నారు. అందులో 20 ఎకరాల భూములకు పట్టాలు మంజూరు చేశారు. 372,  374 సర్వే నెంబర్లలో ఇంకా 20 ఎకరాల భూమికి సంబంధించి గత సంవత్సరంలో ఆర్ఐ లక్ష్మయ్య మూక పంచనామ చేసి ఏడాది పూర్తయిందన్నారు. అప్పట్నుంచి తహసీల్దార్ పట్టాల పంపిణీలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్, బీజెపీ నాయకులు మద్దతు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో రైతులకు పోలీసులు నచ్చజెప్పారు. తహసీల్దార్ చెప్తేనే నిరసన విరమిస్తామని రైతులు భీష్ముంచుకున్నారు. దీంతో తహసీల్దార్ ఆ భూములపై మూక పంచనామా చేసి రైతులకు పట్టాలు అందే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు.  దీంతో రైతుల నిరసన విరమించారు.

More articles

Latest article