27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కొలువుదీరిన ఆలయ పాలక మండళ్లు

Must read

📰 Generate e-Paper Clip

ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గాలు
నియమాక పత్రాలను అందజేసిన షబ్బిర్ ఆలీ
అలయాల అభివృద్ధి కి పాటుపడతామని ప్రతిన చేసిన సభ్యులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని జెండా బాలజీ అలయ కమిటీ చైర్మన్ గా లవంగం ప్రమోద్, శంభూని గుడి ఆలయ కమిటీ  చైర్మన్ గా బింగి మధు, సంతోషి మాత సాయిబాబ దేవస్థానం చైర్మన్ గా గంగా కిషన్ ల అధ్వర్యంలో పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని జెండా బాలాజీ గుడి,శంబుని గుడి,సాయిబాబా గుడిల నూతన ఆలయ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, ఆలయ నూతన కమిటీ అధ్యక్షులకు ,ఆలయ కమిటీ మెంబెర్లకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా దేవదాయ ధర్మాదాయ శాఖ ఈవో నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలయాల అభివృద్ధి కి పాటుపడతామని నూతన సభ్యులు ప్రతిన చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సోసైటీ కార్పొరేషన్ చైర్మన్  మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నుడా చైర్మన్ కేశ వేణు, రైతు సంక్షేమ శాఖ కమిషన్ సభ్యులు  గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకులు నరాల రత్నాకర్,  నగేష్ రెడ్డి,  విఘ్నేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

The temple governing bodies are spread out.

The temple governing bodies are spread out.

 

More articles

Latest article