30.9 C
Hyderabad
Monday, August 3, 2026

క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కృషి

Must read

📰 Generate e-Paper Clip

  • జాతీయస్థాయి సైక్లింగ్ లీక్ పోటీలను ప్రారంభించిన ఎంపీ అరవింద్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ – క్రీడల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసి వారి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కూడా తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. క్రీడాభివృద్ధికి ఖేలో ఇండియా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

The central government's efforts are aimed at the welfare of sportspersonsశనివారం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో రెండు రోజుల పాటు జరిగే సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఈ తరహా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.

The central government's efforts are aimed at the welfare of sportspersons క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖేలో ఇండియా ద్వారా అనేకమంది ప్రతిభ గల క్రీడాకారులు బయటపడుతున్నారన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ నిషా విద్యార్థి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

The central government's efforts are aimed at the welfare of sportspersons

More articles

Latest article