ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ 12 గంటల ఆపరేషన్

0 2,760

. . . గోపాల్ పేట్ లో రూ. 30 లక్షల విలువైన నిషేదిత అల్ప్రజోలం పట్టివేత

. . . ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అబ్కారి అధికారులు

. . . సూత్రాదారి కోసం కోనసాగుతున్న గాలింపు

 బతుకమ్మ, నిజామాబాద్:

నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ అధికారులు లో నిషేదిత అల్ప్రజోలం రవాణా సూత్రదారులను పట్టుకునేందుకు భారీ అఫరేషన్ చెపట్టారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కల్తికల్లు తయారీలో కిలకమైన నిషేదిత అల్ప్రజోలం  గుట్టు రట్టు కోసం 12 గంటల ఆపరేషన్ చెపట్టారు. స్వయంగా ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ అసిస్టెంట్ కమీషనర్, ఇంచార్జీ నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ సోమిరెడ్డి అధ్వర్యంలో ఇద్ధరు సిఐ లు వేంకటేష్, స్వప్నలు, సిబ్బంది శుక్రవారం మద్యహ్నం చెపట్టిన ఆపరేషన్ రాత్రి వరకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం (గోపాల్ పేట్) లో కోనసాగింది. ఆపరేషన్ లో భాగంగా మాసానీపేట్ గ్రామానీకి చెందిన ఓక్కరిని, గాందారీకి చెందిన ఇద్ధరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారి త్రుటిలో తప్పించుకోగా అతని కోసం రాత్రంతా గాలింపు చర్యలు చెపట్టారు.  పట్టుబడిన వ్యక్తుల వద్ధ  3.5 కిలోల అల్ప్రజోలం పట్టుబడింది. దాని విలువ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రూ.30 లక్షల వరకు ఉంటుంది. మత్తు కల్లు తయారికి పరిశ్రమల కేంద్రాలు( కల్లుడిపోల)కు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాజదాని అని చెప్పాలి.ఇక్కడ చెట్టు కల్లుకంటే ప్రధానంగా నిషేదిత మత్తు పధార్థాలను కలిపి కల్లు తయారు చేసి విక్రయించే దందా రైస్ మిల్లులతరువాత స్థానం కల్లు డిపోలదే. కల్లుడిపోలలో కల్లు తయారికి ప్రధానంగా మత్తు కోసం అల్ప్రజోలం వాడుతున్నారు. వారి కోసం కోందరు స్మగ్లర్లు వైట్ కాలర్ బిజినేస్ మాధిరిగా ఈ దందా చేస్తున్నారు. ఓక వేళ అల్ప్రజోలం లేకపోతే ఉమ్మడి జిల్లాలో ఓక్క కల్లు సిసా( కల్లు ప్యాకేట్) బయటకు రాదంటే అతిశయోక్తి కాదు. కల్లు ముస్తేదారులు నీళ్లలో కలిపి కల్తి కల్లు తయారికి వినియోగించే అల్ప్రజోలం కామారెడ్డి జిల్లా రవాణకు అడ్డగా మారిన విషయం తెలిసిందే. అందునా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాందారీ, సదాశివ నగర్, నాగిరెడ్డి పేట్ మండలాల్లో నిషేదిత మత్తు పధార్ధం రవాణా దందాలో ఆరి తేరిన పాత నేరస్తులు ఉన్నారు. ఈ ఎడాది ప్రధమార్థంలో గాందారీలో ఎక్సైజ్ అధికారులు రామారెడ్డికి చెందిన సూత్రదారిని పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం  గోపాల్ పేట్ కు చెందిన ప్రదాన సూత్రదా పరారీలో ఉండగా అతను  దోరికితే అల్ప్రజోలం ఎక్కడి నుంచి రవాణా అవుతుందో గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.