28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్గిల్ విజయ్ దివస్ స్ఫూర్తిదాయక ఘట్టం

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ఎల్లమ్మ గుట్టలో కార్గిల్ స్మారక స్తూపం వద్ద జవాన్లకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

నిజామాబాద్, బతుకమ్మ : యువతలో దేశభక్తి భావన పెంచడానికి కార్గిల్ విజయ్ దివస్ ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలోని కార్గిల్ స్మారక స్తూపాన్ని సందర్శించి, వీర జవాన్లకు ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరచిపోలేమన్నారు.  దేశ భద్రతే ముఖ్యమని భావించి ఆనాడు అటల్ బిహారీ వాజ్ పేయి సాహోసోపోత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.ఆపరేషన్ విజయ్ పేరు మీద భారత సైన్యం పాకిస్తాన్ పై సాధించిన విజయానికి గుర్తుగా ఈకార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article