26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కేటీఆర్ ను సన్మానించిన మాజీ జడ్పిటిసి

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, నాగిరెడ్డిపేట : బీఆర్​ఎస్​ పార్టీ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ కల్వకుంట్ల తారక రామారావును శుక్రవారం నాగిరెడ్డిపేట మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అధ్యక్షతన నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. సభ ముగించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విట్టల్ రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విందుకు కేటీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి, తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు  మిద్దె బాబురావు, వంశీకృష్ణ గౌడ్, దీపక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

More articles

Latest article