మోర్తాడ్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక ఉద్యమంగా మొక్కలు నాటి మొక్కలను సంరక్షించి అడవుల శాతాన్ని పెంచాలని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో శుక్రవారం వనమహోత్సవంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఆబుకారి ఎస్సై మానస మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని అందుకోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్మా రంజిత్, ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు చంద్రమోహన్, దేవేందర్, ఆనంద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
