నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జియో ఇన్ఫమాటిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ కవితా తోరన్ కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో ఈనెల 23 న మాజీ ఇస్రో డైరెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా జియో స్పెసియల్ ఫ్యాకల్టీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు దేశవ్యాప్తంగా 22 మంది శాస్త్రవేత్తలకు ఓపెన్ సోర్స్ జియో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సవివరంగా తెలియజేసినందుకు అందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డాక్టర్ కవిత తోరన్ కు ఈ అవార్డు దక్కడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణం అని వైస్- ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు అభినందించారు.
