24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కూరగాయల సాగు రైతులకు ఊతం

Must read

📰 Generate e-Paper Clip

ఉచితంగా కూరగాయల నారు అందించనున్న ప్రభుత్వం

కామారెడ్డి జిల్లా రైతులు వినియోగించుకోవాలి

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతి

కామారెడ్డి, బతుకమ్మ :  కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కామారెడ్డి జిల్లాలో కూరగాయల సాగుకు ఉచితంగా నారు అందించనున్నట్లు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతి కోరారు. వానాకాలం యాసంగి రెండు సీజన్లలో కలిపి ఏడాదికి 550 ఎకరాల్లో నారును ఉచితంగా అందించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్లో 300 ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు. ఈ సాగును విస్తరించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం కింద 2025- 2026 సంవత్సరానికి గాను హైబ్రిడ్ కూరగాయలనారు ఉచితంగా ఇవ్వనున్నారు. జిల్లాలో మిర్చి టమాట వంకాయ  సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు రాయితీపై నారు అందించనున్నారు. టమాట వంకాయ ఎకరానికి 8000 మొక్కలు అవసరం కాగా, మిర్చి పంటకు 6500 మొక్కలను రాయితీ కింద అందించనున్నారు.  జీడిమెట్ల  సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ నర్సరీలో ఈమొక్కలను పెంచుతున్నారు . నెలరోజుల తర్వాత రైతులు స్వయంగా జీడిమెట్ల వెళ్లి నారు ను తీసుకోవాలి. రైతులు నారు తెచ్చుకొని పొలం లో నాటుకున్న తర్వాత ఉద్యాన అధికారి తనిఖీ చేస్తారు.

నెల ముందే దరఖాస్తు చేసుకోవాలి..

ఉచిత నారు రాయితీ పై రైతులకు అవగాహన కల్పిస్తున్న తరుణంలో ఇప్పటి  వరకు 31 ఎకరాలకు ఉద్యనశాఖ అధికారులు ఇండెంట్ పెట్టారు.  సాగు చేసే నెల రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి మొత్తంగా ఈ సీజన్లో 200 ఎకరాలకు సరఫరా చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 31 ఎకరాలకు సంబంధించి 17 మంది రైతులే అర్జీ పెట్టారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.ఈ ఆర్ధిక సంవత్సరం  ఉల్లి పంటకు సైతం జిల్లాలో రాయితీ ఇవ్వనున్నారు.  ఎకరానికి 8000 చొప్పున ఉల్లి నారు అందించనున్నారు. వానకాలం లో వేసిన రైతులు, యాసంగి లో వేసుకునే రైతులు కూడా ముందుగా మీ ఉద్యాన అధికారి దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలి.

కూరగాయల పందిరి కి కూడా రాయితీ..

జిల్లా లో తీగ జాతి కూరగాయలు సాగు చేసే రైతులకు కూడా ఉద్యాన శాఖ ద్వారా పందిరి కి రాయితీ ఉంది. ఒక్క యూనిట్ ఆరెకరం కాగా 50,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కు 50 యూనిట్ టార్గెట్ ఇవ్వగాఇప్పటి వరకు 10 యూనిట్లు కు రైతులు దరఖాస్తు చేసుకున్నారు.

మల్చింగ్ సాగు కు కూడా రాయితీ..

ఎకరానికి 8000 చొప్పున ఒక రైతుకి గరిష్టంగా రెండు ఎకరాల వరకు రాయితీ అందించడం జరుగుతుంది. మల్చింగ్ వేసిన రైతుల పొలం ను ఉద్యాన అధికారి తనిఖీ చేసినపుడు ఆధార్ కార్డు పట్టపాస్ బుక్ బ్యాంకు అకౌంట్ తో పాటు  మల్చింగ్ కొన్న జీఎస్టీ బిల్లును ఇవ్వాలి. 300 ఎకరాలు టార్గెట్ ఇవ్వగా ఇప్పటి వరకు 120 ఎకరాలు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కూరగాయలు ఉల్లినారును,మల్చింగ్ ,పందిరి సాగు పైన రాయితీ లను  అందించనుంది. రైతులు  ముందు దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలకు 8977714030,  8977714029 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

More articles

Latest article