బతుకమ్మ, మోర్తాడ్: వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై ఏడు రోజులు గడుస్తున్నా సందర్భంగా మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో యజ్ఞం కాల్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు శాంతి యుతంగా ఉండాలని, పాడిపంటలు మంచిగా పండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని యజ్ఞాలు కాల్చినట్లు తెలిపారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన సత్రం నిర్వహించడం జరిగింది. స్థానిక భక్తులు అన్నదానంలో పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అక్షయ్,అరుణ్, పద్మశాలి హరీష్, రాకేష్, సాయి, ఆనంద్, సిద్దు, సంతోష్, నాని, శివ తదితరులు పాల్గొన్నారు.

