27.3 C
Hyderabad
Friday, July 31, 2026

మాతృశ్రీ స్కూల్‌లో వనమహోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో, మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్  సహకారంతో మాతృశ్రీ స్కూల్‌లో వనమహోత్సవం కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు. విద్యార్థుల్లో హరితచేతనను పెంపొందించేందుకు పర్యావరణం ప్రాధాన్యత, వృక్షాల అవసరం వంటి అంశాలపై అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. పచ్చని భూమిని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా మంచి స్పందనతో ప్రశంసలు అందుకుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Vanamahotsavam at Matrushri School

More articles

Latest article