24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎరువులను వెంటనే సరఫరా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

 

వర్ని, బతుకమ్మ : ఎరువుల కొరతను నివారించి రైతులకు వెంటనే ఎరువులను సరఫరా చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. వర్ని మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా  శిక్షణ తరగతులను ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ డి ఏ పి, తదితర సేంద్రియ ఎరువుల వాడకం కోసం రైతులు ఎరువుల గోడౌన్ లో వద్ద, ఫర్టిలైజర్ షాపుల వద్ద బారులు తీరి ఎరువుల కొరకు ఎదురు చూస్తున్నారని  సకాలంలో ఎరువులు అందని యెడల రైతులు ఎదుగుతున్న పంటలను కాపాడుకోలేరని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎరువులను  అడిగి చేతులు దులుపుకోవడం కాదని  అందరికీ ఎకరానికి 5 బస్తాల చొప్పున డిఏపీని సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక గ్రామాల్లో రైతులు ఎరువులు కొరకు రోజు ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అదేవిధంగా వర్ని ప్రాంతంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కాకుండా అక్రమార్కులు ఆక్రమించుకునే పరిస్థితులు వస్తున్నాయని వాటిని అరికట్టి అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని అవినీతిని అరికట్టి  అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలతో ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నే సబ్, ఏరియా కమిటీ సభ్యులు లక్ష్మణ్, భీమయ్య, సాయిలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article