26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వం నిర్దేశించిన సేవలను మాత్రమే అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆర్డీఓ రాజేంద్రకుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మీసేవ సెంటర్లు ప్రభుత్వం నిర్దేశించిన సేవలను, ధరల పట్టిక ప్రకారం మాత్రమే సేవలు అందించాలని ఆర్డీఓ రాజేంద్రకుమార్ స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండల పరిధిలోనికి వచ్చే మీసేవ కేంద్ర నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేందర్ హాజరయ్యారు. ఈ సమావేశం నిజామాబాద్ ఉత్తర తహసిల్దార్ బి.విజయ కాంత్ రావ్, దక్షిణ తాసిల్దార్ జె బాలరాజ్  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ జిల్లా అదనంగా రుసుము స్వీకరించినట్టు ఫిర్యాదు వస్తే వారి పైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తు స్వీకరించే సమయంలో అన్ని దస్తావేజులను, ధృవపత్త్రాలను పరిశీలించి అప్లోడ్ చేయాలని తెలిపారు. రేషన్ కార్డుల జారీకి మధ్యవర్తులు ఎవరైనా ఉంటె వారిపైన కేసు నమోదు చేయబడుననీ తెలిపారు. జాగ్రత్త వహించి ఇలాంటి తప్పిదాలు ఫిర్యాదు లేకుండా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో నిజాంబాద్ ఉత్తర, దక్షిణ మండల మీసేవ ఆపరేటర్లు యాజమాన్యాలు పాల్గొన్నారు.

Only services specified by the government should be provided

More articles

Latest article