27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మాక్లూర్ ఎంపీడీవోగా బ్రహ్మానందం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాక్లూర్ : మాక్లూర్ ఎంపీడీవో గా బ్రహ్మానందంగ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో గా విధులు నిర్వహించిన లక్ష్మారెడ్డి  ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బ్రహ్మానందం మాట్లాడుతూ మండలంలోని రాజీ లేకుండా పని చేస్తామన్నారు. గ్రామాలపై ప్రత్యేక దృష్టి సాగిస్తానని పేర్కొన్నారు మాక్లూర్ మండలాన్ని మరింత అభివృద్ధితో ఆదర్శవంతంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల్లోని ఎటువంటి సమస్యలు వచ్చిన  పరిష్కరిస్తామని గ్రామ పాలనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సిబ్బందికి హెచ్చరించారు‌.ఈ సందర్భంగా మండల సిబ్బంది నూతన ఎంపీడీవో బ్రహ్మానందం  శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండలంలోని మదన్ పల్లి గ్రామపంచాయతీలో డెంగ్యూ సోకిన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిశుభ్రత గురించి ఆరా తీసి గ్రామస్థాయి సిబ్బందికి  పలు సూచనలు జారీ చేశారు. మండలంలోని గ్రామస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు గ్రామ విధివిధానాల గురించి సమాచారం తెలిపాలని సూచించారు.

More articles

Latest article