27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • విద్యా కమిషన్ చైర్మన్ మురళికి పీడీఎస్యూ వినతి

 

డిచ్ పల్లి, బతుకమ్మ :  తెలంగాణ యూనివర్సిటీలో సమస్యల మీద అభిప్రాయ సేకరణకు విచ్చేసిన మాజీ ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ మురళికి పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీలో బాలికలకు హాస్టల్ భవనాన్ని నిర్మించాలన్నారు. యూనివర్సిటీలో ఉన్న కోర్సులన్నీ సెల్ ఫైనాన్స్ కోర్సులు కాకుండా రెగ్యులర్ కోర్సులుగా చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ ఎల్.ఎల్.బి, ఇంజనీరింగ్ కళాశాల, అగ్రికల్చర్ కళాశాల, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల కోర్సులను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. పరిశోధకు సంబంధించిన సెంట్రల్ రీసెర్చ్ లాబరేటరీ, క్రీడా మైదానం మరియు ఆడిటోరియం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. స్పెషలైజేషన్ కోర్సులను, అధునాతన నూతన కోర్సులను ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించారు. టీచింగ్, నా టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సౌత్ క్యాంపస్ లో సెంట్రల్ లైబ్రరీ నిర్మించాలన్నారు. పీజీ విద్యార్థులను  పరిశోధన రంగాలకు ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి 1000 కోట్ల  నిధులు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలన్నారు. గురుకులాలకు ఎస్ఎంఎస్ హాస్టల్లకు సొంత నూతన భవనాలు నిర్మించాలన్నారు. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు సృజన్,మహేందర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article