26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అడ్మిషన్ల పేరుతో వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా విద్యా శాఖ అధికారికి విద్యార్థి సంఘాల ఫిర్యాదు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్పీఆర్ పాఠశాల లో అడ్మిషన్ల పేరుతో వసూలు చేసిన 20 లక్షల రూపాయలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి 5000 రూపాయలు వసూలు చేసి గవర్నింగ్ బాడీ లేకుండానే ఫీజులు నిర్ణయించిన ఎస్పీఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా యజమాన్యం ఏకపక్షంగా ఫీజులను నిర్ణయించి వేలది రూపాయలను వసూలు చేస్తున్నారన్నారు. యాజమాన్యం చెప్పిన షాపులోనే పుస్తకాలను కొనాలని ఒత్తిడి చేస్తూ ఎక్కువ ధరలు పుస్తకాలను అమ్ముతున్నారన్నారు. ఐఐటీ తరగతి పేరుతో అదనంగా 15 వేల నుంచి 20 వేల రూపాయలు వసూలు చేస్తూ దిశా ప్రోగ్రాం తో పేరుతో  తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. తల్లితండ్రుల సమక్షంలో మాత్రమే ఫిజులను నిర్ణయించాలని విద్యా హక్కు చట్టం చెపుతుందని తెలిపారు. వెంటనే ఓపెన్ గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేసి ఫీజులను నిర్వహించాలన్నారు. అడ్మిషన్ పేరుతో వసూలు చేసిన ఐదు వేల రూపాయలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్ టీంకు,స్టాలిన్, శ్యామ్ ,మనోజ్,సూఫీయాన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article