24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచండి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచండి అని ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న పేర్కొన్నారు. శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న ఉమ్మడి జిల్లా జూనియర్ కళాశాలలో హాజరు శాతం పెంచే విధంగా ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలని ఆయన కోరారు. పిట్లం జూనియర్ కళాశాలలో హాజరు శాతం తక్కువ ఉండడంతో ఆగ్రహం  వ్యక్తం చేశారు. ప్రతి టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులు ఇంటి వద్దకు వెళ్లి వారికి మోటివేషన్ చేసి కాలేజీలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు మోటివేషన్ చేసి కాలేజీలో చేర్పించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకై ప్రభుత్వము ప్రతినెల 12000 మంజూరు చేసిందని ఈ రూపాయలతో కళాశాలలో కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఇంటి వద్ద నుండే త్రాగడానికి నీరు తెచ్చుకుంటున్నారని ప్రశ్నించగా కళాశాలలో ఉన్న వాటర్ ఫిల్టర్ ను బాగు చేయించి త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి  554 మంది ఉత్తీర్ణులు కాగా కళాశాలలో అడ్మిషన్లు అయినవి 1 59 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు . ప్రభుత్వ పాఠశాలలు చదివిన విద్యార్థులు సంక్షేమ గురుకుల పాఠశాలలో వెళ్లినట్లు సమాచారం ఉందని అధ్యాపకులు తెలిపారు..ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

More articles

Latest article