27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పొందూర్తి ఆర్టీవో చెక్ పోస్ట్ పై  ఏసీబీ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

పరారైన ఆర్టీవో అధికారుల అసిస్టెంట్లు
 భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలంలోని పొందుర్తి ఆర్టీవో చెక్ పోస్ట్ లో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడులతో ఈ చెక్ పోస్ట్ లో పనిచేసే ఆర్టీవో అధికారుల అసిస్టెంట్లు పరారైనట్టు తెలిసింది. మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లే లారీల వద్ద చెక్ పోస్ట్ అధికారులు భారీ మొత్తంలో డబ్బులు వసులు చేస్తున్నారని సమాచారం మేరకు ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత నెలలో మద్నూర్ మండలం సలాబత్ పూర్ అంతర్రాష్ట చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈదాడుల్లో  రూ.1.20 లక్షలను  అధికారులు సీజ్ చేశారు.

ACB raids on Paddurthi RTO check post

More articles

Latest article