24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక క్వారీ పనులు అడ్డుకున్న గ్రామస్తులు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే, అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు
  • టిప్పర్లు, జేసీబీ సీజ్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు

 

బతుకమ్మ, కోటగిరి : పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో ఇసుక క్వారీ కోసం చేస్తున్న పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఇసుక క్వారీ ఏర్పాటు చేసి  టిప్పర్ల ద్వారా ఇసుక తరలించడంతో మంజీరా నదికి అనుకోని ఉన్న తమ పంట భూములకు నష్టం వాటిల్లడంతోపాటు  సుమారు 200 వ్యవసాయం బోర్లలలో  గ్రౌండ్ వాటర్ తగ్గి పంటలు ఎండిపోయే అవకాశం ఉందని  ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు క్వారీ పనులను అడ్డుకొని  స్థానిక అధికారులతో పాటు స్థానిక ఎంఏల్ఏ కు సైతం పిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా  తమ ఇష్టానుసారంగా జెసిబిలు, టిప్పర్ల సహాయంతో  త్రవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో  తమ గ్రామం నుండి ఇసుక తరలించేది లేదంటూ భీష్ముంచారు.

  • ఎలాంటి సమాచారం అందలేదు  : ఎంఆర్ఓ గంగాధర్

ఇసుక క్వారీ ఏర్పాటుకై పూర్తి ప్రక్రియ పూర్తి కాలేదని. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు.  అనుమతులు లేకుండా జెసిబి టిప్పర్ల ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని సుంకిని గ్రామస్తుల ఫిర్యాదు. చేయడంతో ఘటనా స్థలం చేరుకొని అక్కడ  క్వారీ పనులు చేస్తున్న జెసిబి టిప్పర్లను  సీజ్ చేసి కోటగిరి పోలీస్ స్టేషన్ కు తరలించమని ఆయన అన్నారు.

More articles

Latest article