29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

స్నేహశీలి కృపాల్ సింగ్

Must read

📰 Generate e-Paper Clip

  • పండిత పరిషత్ ఆధ్వర్యంలో సత్కారం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగంలో ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా, స్వచ్ఛంద సేవకునిగా కృపాల్ సింగ్ అందరి మన్ననలు అందుకున్నాడని, ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ సాంకేతికమేనని, కృపాల్ సింగ్ భవిష్యత్తులో విద్యా సేవలో ముందుకు సాగాలని, ఆయన గొప్ప స్నేహశీలి అని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జమీల్లుల్ల అన్నారు. బర్కత్ పుర ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృపాల్ సింగ్ పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ యు పి పి టి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన కృపాల్ సింగ్ మునుముందు కూడా ఉపాధ్యాయులకు అండగా నిలవాలని కోరారు. ఉపాధ్యాయుడు చిలుక విద్యాసాగర్ మాట్లాడుతూ కష్టాలలో ఉన్న ఉపాధ్యాయులకు కృపాల్ సింగ్ ఆపద్బాంధవుడు అని కొనియాడారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ ను ఘనపురం దేవేందర్, మహమ్మద్ జమీలుల్లా,  చిలుక విద్యాసాగర్ లు ఘనంగా సన్మానించారు.

More articles

Latest article