- మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలో వివిధ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను వేగవంతంగా పూర్తి చెయ్యాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం కమిషనర్ నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తొందరగా బేస్మెంట్ పూర్తి చేయాలని, బేస్మెంట్ పూర్తయిన వెంటనే వారి అకౌంట్ లో లక్ష రూపాయలు జమ అవు తాయన్నారు. వారి వెంట మేనేజర్ నరేందర్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు.
