28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాలో డెంగ్యూ పడగనీడ

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లాలో ఒక్కరోజే 4 పాజిటివ్ కేసులు
  • వారం రోజుల్లో 15 కేసులు
  • సీజన్ లో 40కి పైగా పాజిటివ్ కేసులు

 

నిజామాబాద్, బతుకమ్మ : వర్షాకాలం ముసురుకోలేదు. జిల్లాలో లోటువర్షాపాతం కొనసాగుతుంది. రైతులు, ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తుండగా వానకాలంకు సంబంధించిన సీజనల్ వ్యాధులు మాత్రం ముసురుతున్నాయి. ప్రధానంగా దోమకాటు ద్వారా వచ్చే డెంగ్యూ జ్వరం కేసులు బయటపడుతున్నాయి. ఈ నెల 7న నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీ యూహెచ్ సీ, ముదక్ పల్లి, పోతంగల్, సిరికొండ పిహెచ్ సీల పరిధిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్ లో జిల్లాలో 40 కేసులు పైగ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. జూన్ మాసంలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా జులైలో ఈ నెల 8 వరకు 15 కేసులు పాజిటివ్ గా గుర్తించారు. గతేడాది నిజామాబాద్ జిల్లాలో 704 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ యేడాది డెంగ్యూ పాజిటివ్ కేసులు అనాధికారికంగా 128 నమోదైనట్లు చెబుతుండగా రికార్డుల పరంగా 50కు పైగానే డెంగ్యూ కేసులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఎపిడమిక్ సీజన్ లో డెంగ్యూ దోమ తన ప్రతాపాన్ని చూపుతోంది. డెంగ్యూ సాధారణ జ్వరంతో ప్లేట్ లెట్లు తగ్గి తీవ్ర అనారోగ్య పరిస్థితులతో డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కు దారి తీయవచ్చు. ప్రధానంగా డెంగ్యూ జ్వరానికి కారణమైన ఎడిస్ఈజిప్టి దోమ మురికి కాలువల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో సంతాన వ్రుద్దిని చేసుకుని పెరుగుతుంది. ఒకప్పుడు అటవి ప్రాంతాలతో పాటు ప్రాజెక్టుల ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు జిల్లా అంతటా డెంగ్యూ కేసులు వెలుగు చూస్తున్నాయి. దోమలను నియంత్రించడానికి పంచాయితీలతో పాటు బల్దియాలో పాటు పడుతున్నా కేసులు మాత్రం వెలుగు చూస్తునే ఉన్నాయి. ఇటీవల కాలంలో పాలకవర్గాలు లేకపోవడంతో పారిశుధ్ద్య పనులు  అటకెక్కాయి. అదే విధంగా నిధుల లేమితో పారిశుద్ద్య పనుల నిర్వాహణ సాధ్యం కావడం లేదు. వర్షాకాలం వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రతి శుక్రవారం డ్రైడేను నిర్వహిస్తున్నా కేసులు మాత్రం పెరుగుతునే ఉన్నాయి.

  • సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు పని చేస్తున్నాం
  • జిల్లా మలేరియా అధికారి డా.తుకారాం రాథోడ్

నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్ లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆయా పీహెచ్ సీల వారిగా పరిగణలోకి తీసుకుంటే మోస్రా, ముదక్ పల్లి, సిరికొండ, నిజామాబాద్ అర్బన్ లోని సీతారాంనగర్ కాలనీ, అర్సపల్లి, చంద్రశేఖర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో పాజిటివ్ కేసులు ఎక్కువగా గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు స్థానిక మున్సిపల్, పంచాయితీ అధికారులతో కలిసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పర్యటనతో పాటు యాంటి లార్వ సర్వే నిర్వహిస్తున్నాం. దానికి తోడు వైద్య సేవలను అందించి డెంగ్యూ జ్వరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

More articles

Latest article