జిల్లాలో డెంగ్యూ పడగనీడ
జిల్లాలో ఒక్కరోజే 4 పాజిటివ్ కేసులు వారం రోజుల్లో 15 కేసులు సీజన్ లో 40కి పైగా పాజిటివ్ కేసులు నిజామాబాద్, బతుకమ్మ : వర్షాకాలం ముసురుకోలేదు. జిల్లాలో లోటువర్షాపాతం కొనసాగుతుంది. రైతులు, ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తుండగా వానకాలంకు సంబంధించిన సీజనల్ వ్యాధులు మాత్రం ముసురుతున్నాయి. ప్రధానంగా దోమకాటు ద్వారా వచ్చే డెంగ్యూ జ్వరం కేసులు బయటపడుతున్నాయి. ఈ నెల 7న నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీ యూహెచ్ సీ, ముదక్ పల్లి, పోతంగల్, సిరికొండ పిహెచ్ సీల పరిధిలో...