27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతులు ఎటువంటి అపోహలకు గురికావద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • వ్యవసాయ అధికారి వైష్ణవ్

 

బతుకమ్మ,ఏర్గట్ల: మండలానికి ఈ వానాకాలం సంబంధించి శుక్రవారం 567 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. గురువారం ఒక్కరోజే 1800 బస్తాల యూరియా రావడం జరిగిందని, శుక్రవారం రోజు కూడా సరఫరా జరుగుతుంది. వ్యవసాయదారులు గమనించాలని, మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు. అలాగే రైతుసోదరులు ఎటువంటి అపోహలకు గురికావద్దు, మనకి కావాల్సిన యూరియా మరియు కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నవి కావున రైతులు అవసరానికి తగినంతనే తీసుకెళ్లాలి అని అన్నారు. మండలానికి సరిపడా ఎరువుల సరఫరా ప్రతిరోజూ జరుగుతుంది కావున రైతులు ఎట్టి పరిస్థుతుల్లో ఆందళోనకు గురికావద్దు, వదంతులను నమ్మొద్దు.కొన్ని చోట్ల మొక్కజొన్న మరియు ఇతర పంటలలో యూరియా ఎరువు మోతాదుకుమించి వాడుతున్నట్లు గమనించడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో నత్రజని ఎరువులు అధికమోతాదులో వాడకూడదు, ఆలా వాడితే వివిధ తెగుళ్లు, చీడపీడలు ఆశించడానికి కారణం అవుతుంది కాబట్టి రైతులు నత్రజని ఎరువులు సిఫార్సు మేరకే వాడుకోవాలి పెట్టుబడి ఖర్చులని తగ్గించుకోవాలి అని ఏర్గట్ల వ్యవసాయ అధికారి వైష్ణవ్ మండలంలోని రైతులకు తెలిపారు.

More articles

Latest article