మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సావెల్ లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయురాలు సావిత్రి పాఠశాలలోని విద్యార్థులందరికీ స్వంత డబ్బులతో ఆర్థిక సహాయం అందించి ఉచితంగా టై ,బెల్టులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బషీరుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.