27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

శ్రీశైలం,బతుకమ్మ :  ఏపీలోని శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం జూలై 1 నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గతంలో లాగానే వారంలో 4 రోజుల పాటు అనగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో మధ్యాహ్నం గం.1.45 నుంచి 3.45 వరకు రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కొనసాగుతుందని  తెలిపారు. ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఉచిత దర్శనం కోసం ఏరోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకన్లను జారీ చేయబడుతాయన్నారు. ఈ కంప్యూటరైజ్డ్ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ టోకెన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందని.. వీరిని ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు.

More articles

Latest article