శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం

శ్రీశైలం,బతుకమ్మ :  ఏపీలోని శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం జూలై 1 నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గతంలో లాగానే వారంలో 4 రోజుల పాటు అనగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో మధ్యాహ్నం గం.1.45 నుంచి 3.45 వరకు రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కొనసాగుతుందని  తెలిపారు. ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఉచిత దర్శనం...