28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం సాయంత్రం నిర్వహించారు. 69 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. అధ్యక్షుడి బరిలో సుధాకర్ గౌడ్ , మామిళ్ల రాజు నిలిచారు. సుధాకర్ గౌడ్​కు 40 ఓట్లు, మామిళ్ల రాజు 28 ఓట్లు దక్కాయి. ఒక ఓటు నోటాకు పడింది. దీంతో సుధాకర్ గౌడ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు పొటీలో ఉండగా గంట చంద్రశేఖర్​కు 40 ఓట్లు, యూనుస్​కు 28 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షులుగా ప్రమోద్ రెడ్డి, శ్యాంసుందర్, కోశాధికారిగా రుద్రంగి అశోక్, జాయింట్ సెక్రెటరీలుగా ఇలియాస్, సలీం, కార్యవర్గ సభ్యులుగా అరుణ్ రెడ్డి, జాకీర్, నజీర్, సుధీర్, మహేష్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ…బాన్సువాడ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమపై నమ్మకంతో తమకు ఓటు వేసి గెలిపించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటీ సభ్యులను ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Sudhakar Goud as the president of Banswada Press Club

More articles

Latest article