27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాశమైలారం పారిశ్రామికవాడలో పేలిన రియాక్టర్

Must read

📰 Generate e-Paper Clip

10 మంది కార్మికులు మృతి

సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి. . పేలుడు దాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోయింది. మరో భవనానికి  బీటలు వచ్చాయి.  ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 10 మంది కార్మికులు మృతి చెందారు.

కార్మికులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి: సీఎం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

More articles

Latest article