29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బాన్సువాడ నుంచి రామప్పకు టూర్ ప్యాకేజీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : ఆర్టీసీ ప్రయాణికులకు మరోసారి సువర్ణావకాశాన్ని కల్పించింది. కుటుంబ సభ్యులు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సి వస్తే ప్రైవేటు బస్సులు, బస్​ ట్రావెల్స్‌‌ ఏజెన్సీలతో మాట్లాడుకుని వాహనాలను బుక్​ చేసుకుంటారు. అయితే ఈ ట్రిప్​లకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి వారికోసం ఆర్టీసీ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది.

  • భద్రకాళి అమ్మవారి దర్శనం…

బాన్సువాడ నుంచి వరంగల్  జిల్లాలోని రామప్ప, లక్నవరం, భద్రకాళి గుడి ప్యాకేజీ టూర్ జూలై 6న డీలక్స్ బస్సు బయలుదేరుతున్నట్లు డిపో మేనేజర్ సరిదా దేవి తెలిపారు. ఉదయం 6 గంటలకు బయలుదేరి పాలంపేటలోని రామప్ప శివుని (రామలింగేశ్వరుని) దర్శనం తర్వాత లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జి/లేక్ వ్యూ తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని రాత్రి 11 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 750 ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. www.tgsrtcbus.inలో (సర్వీసు నెంబర్: 96668 ) బాన్సువాడ-లక్నవరం అనే రూట్లో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. లేదా టికెట్స్ బుకింగ్ కోసం గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని డీఎం పేర్కొన్నారు.

More articles

Latest article