కరీంనగర్, బతుకమ్మ : అత్యంత విషపూరితమైన పారా క్వాట్ హెర్బీసైడ్ గడ్డి మందుపై తక్షణమే దేశ వ్యాప్తంగా నిషేధం విధించాలని కోరుతూ హెల్త్ కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్. ఆర్. డీ. ఏ), డాక్టర్స్ అగైనెట్స్ పెరాక్విడ్పాయిజన్ (డీ. ఏ. పీ. పీ)లు ప్రతినిధులు శనివారం కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతిని కలసి వినతి పత్రం అందజేశారు.విరుగుడే లేని ఈ గడ్డి మందు వల్ల అనేక అనార్థలకు దారి తీస్తుందని,క్షణికావేశంలో దీనిని ఆత్మహత్య కు వినియోగించి చాలా మంది అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ మందు పిచికారి చేసే రైతులకు తెలువకుండానే ఊపిరితిత్తులోకి వెళ్లి తీవ్ర అనారోగ్యానికి గురించేస్తుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ మందు పిచికారి చేసేవాళ్ళు, అమ్మకాలు చేసే వాళ్లకు పార్కిన్సన్ అనే వ్యాధిబారిన పడుతున్నారని వివరించారు. ఇప్పటికే ప్రపంచంలోని యూరప్, బ్రిటన్, బ్రెజిల్, చైనా, దక్షణ కొరియ లాంటి దేశాలు ఇప్పటికే నిషేదించాయని తెలిపారు. ఈ పారా క్వాట్ ను తక్షణమే నిషేధించి, ఈ పారా క్వాట్ విష ప్రయోగాలను పర్యవేక్షించేందుకు గాను పాయిజన్ రిజిస్ట్రిని ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి సిఫారస్ చెయ్యాలని వారు వినతి పత్రం ద్వారా కలెక్టర్ ను కోరారు. వినతి పత్రం అందించిన వారిలో హెల్త్ కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్. బండారి రాజ్ కుమార్(టి. జీ. ఏం. సీ. మెంబర్), వైస్ ప్రెసిడెంట్ డాక్టర్. పై. గౌతమ్, జనరల్ సెక్రటరీ డాక్టర్. జి. యస్. శరణ్ లుఉన్నారు.
