బాన్సువాడ నుంచి రామప్పకు టూర్ ప్యాకేజీ
బతుకమ్మ, బాన్సువాడ : ఆర్టీసీ ప్రయాణికులకు మరోసారి సువర్ణావకాశాన్ని కల్పించింది. కుటుంబ సభ్యులు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సి వస్తే ప్రైవేటు బస్సులు, బస్ ట్రావెల్స్ ఏజెన్సీలతో మాట్లాడుకుని వాహనాలను బుక్ చేసుకుంటారు. అయితే ఈ ట్రిప్‌లకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి వారికోసం ఆర్టీసీ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. భద్రకాళి అమ్మవారి దర్శనం... బాన్సువాడ నుంచి వరంగల్ జిల్లాలోని రామప్ప, లక్నవరం, భద్రకాళి గుడి ప్యాకేజీ టూర్ జూలై 6న...