30.9 C
Hyderabad
Monday, August 3, 2026

 మెడికల్ కాలేజీని తనిఖీ చేసిన డైరెక్టర్ ఆప్ హెల్త్

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలను దాని అనుబంద జిల్లా జనరల్ ఆసుపత్రి (జిజి హెచ్ )ను  డైరెక్టర్ ఆప్ హెల్త్ ( డిహెచ్) డాక్టర్ రవీంధర్ నాయక్ తనిఖీ చేసారు. ఇటివల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణల విషయంలో లోపాలను ఎత్తి చూపుతు 34 కళాశాలలకు గాను 27 కాలేజీలలో తరగతుల నిర్వహణకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అదేశాల మేరకు గురువారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవింధర్ నాయక్, జిల్లా  కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డిలతో కలిసి  నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో పరిశీలించారు. తెలంగాణలో అతి పెద్ధ మెడికల్ కళాశాలలో నాల్గవ స్థానంలో ఉన్న నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంసిఐ తనిఖీల నాటికి ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులనుఅ దేశించారు డిహెచ్ వెంట జిల్లా కలెక్టర్ తో పాటు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫ్రో. డాక్టర్ శివ ప్రసాద్, జిజిహెచ్ సూపరింటేండేంట్ ఫ్రో. డాక్టర్ శ్రీనివాస్, డియంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీతో పాటు టియస్ యంఐడిసి అధికారులు తదితరులు ఉన్నారు.

Director of Health inspects medical college

More articles

Latest article