28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలనిలంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో గురువారం ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 బెస్ట్ అవైలబుల్స్ స్కీం కింద దాదాపు 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు.  ఈ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పాఠశాల యజమాన్యాలు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది గురి అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జాదవ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article