24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో పుస్తకాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: స్థానిక  ప్రభుత్వ పాఠశాల ఎంపీ పీ ఎస్ తడపాకల్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు కవిత  కుమారుడు ఫణీంద్ర పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో ఒక ప్రత్యేక పుస్తకాల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  తెలుగు,ఇంగ్లీష్ కి సంబంధిన  చూచి వ్రాత పుస్తకాలను సొంత ఖర్చుతో   తెప్పించి విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంలో ప్రధానోపాధ్యాయులు కవిత మాట్లాడుతూ  విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించేందుకు, చదువు జీవితాన్ని మలుపుతిప్పే శక్తిగా పనిచేస్తుందని  పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే చదువుపట్ల ప్రేమ పెరిగాలి అని అందుకు ఈరోజు మా కుమారుని పుట్టినరోజు గుర్తుగా పిల్లలకు ఉపయోగపడేలా స్మరణీయంగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహించానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్, శ్రావణి, సుధాకర్, చక్రపాణి, రవి పాల్గొన్నారు.

More articles

Latest article