పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో పుస్తకాల పంపిణీ
బతుకమ్మ, ఏర్గట్ల: స్థానిక ప్రభుత్వ పాఠశాల ఎంపీ పీ ఎస్ తడపాకల్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు కవిత కుమారుడు ఫణీంద్ర పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో ఒక ప్రత్యేక పుస్తకాల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు,ఇంగ్లీష్ కి సంబంధిన చూచి వ్రాత పుస్తకాలను సొంత ఖర్చుతో తెప్పించి విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంలో ప్రధానోపాధ్యాయులు కవిత మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించేందుకు, చదువు జీవితాన్ని మలుపుతిప్పే శక్తిగా పనిచేస్తుందని పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే చదువుపట్ల ప్రేమ పెరిగాలి అని అందుకు ఈరోజు...