బతుకమ్మ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిచ్కుంద మండలంలో మధ్యంతరంగా నిలిపివేసిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని బిచ్కుంద మండల అధ్యక్షులు శెట్పలి విష్ణు మాట్లాడుతూ బిచ్కుంద మండలంలో ఈ రోజు బస్టాండ్ చౌరస్తాలో రాస్తారోక నిర్వహించడం జరిగింది. ఇట్టి రాస్తారోక నిర్వహిస్తామని తెలిసి రెండు జెసిబి లతో బిచ్కుందలో చాలా రోజుల నుండి నిలిపివేసిన సెంట్రల్ లైటింగ్ పనులను స్టార్ట్ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే, నాయకులు బిజెపి ధర్నాకు రాస్తారోకకు భయపడి పనులను బిచ్కుందలో స్టార్ట్ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మద్నూర్, పిట్లం మండలాలలో సెంట్రల్ లైటింగ్ పనులను త్వరలో ప్రారంభించాలని కోరుతున్నాం లేని యాడల భారతీయ జనతా పార్టీ అని మండలాల్లో కూడా ధర్నాలు రాష్ట్రరోకా నిర్వహిస్తుందని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార గారు, కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ రాము సెట్, బిచ్కుంద జనరల్ సెక్రటరీలు జాదో పండరి, ముత్యం పిరాజీ, 8 మండల అధ్యక్షులు జనరల్ సెక్రెటరీలు, భూత్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులందరూ పాల్గొన్నారు.
