28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దేశంలో ఆప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు
  • సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్

 

బతుకమ్మ, కోటగిరి:  భారతదేశంలో ఆప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తుందని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు భారతీయులు ప్రశ్నిస్తూనే ఉంటారని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో కామ్రేడ్ నాగనాథ్ అధ్యక్షతన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు దేశంలో ప్రజాస్వామ్యం – సవాళ్ల పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ, 1975లో ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి అభాసుపాలైతే, ఈనాడు నరేంద్ర మోడీ ఎమర్జెన్సీని మించి ఆప్రకటిత ఎమర్జెన్సీ నడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే చర్యలు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. ఈ సదస్సులో పార్టీ నాయకులు సాయిబాబాగౌడ్, ప్రజా సంఘాల నాయకులు అర్జున్, వసురాం, సునీత, పోశెట్టి, లింగవ్వ, నాగరాజు, హన్మాండ్లు, సాయిలు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article