27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వీధి దీపాలు లేక ఇక్కట్లు 

Must read

📰 Generate e-Paper Clip

  • గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందజేత

 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని కుమ్మరి గల్లి లో వీధి దీపాలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారని ఆర్టిఐ ప్రతినిధి గంగల రవీందర్ అన్నారు. వీధి దీపాలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రాత్రి వేళలో చీకటిగా ఉండటం వల్ల ఆ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ముఖ్యంగా మహిళలు విద్యార్థులు వృద్ధులు రాత్రిపూట రావాలంటే భయపడుతున్నారు వీధి దీపాలు లేకపోవడం దొంగతనాలకు నేరాలకు జరిగే అవకాశం కూడా ఉందన్నారు. వీధి దీపాల సమస్యను పరిష్కారం కోసం గ్రామపంచాయతీ సెక్రటరీ మహేష్ కుమార్ మంగళవారం వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం స్వీకరించిన పంచాయతీ సెక్రటరీ సమస్యను అతి తొందరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రాజు లింగం యాదగిరి నారాయణ తదితరులు ఉన్నారు.

More articles

Latest article