28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్  శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దేశ సమైక్యత కోసం తన పదవులను, అధికారాన్ని వదులుకొని ఒక దేశంలో రెండు విధానాలు వుండే ప్రసక్తే లేదు అని నినాదించి కాశ్మీర్ వేర్పాటు వాదుల నుండి రక్షించడానికి భారత మాత పాదాలకు తన ప్రాణాన్ని బలిదానం ఇచ్చిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. అనంతరం మండల బిజెపి పార్టీ అధ్యక్షులు అలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యావరణ కమిటీ కో కన్వీనర్ మార్కెలి ప్రకాష్ పటేల్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల  ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, భోజిగొండ అనిల్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, సందీప్, సాయి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article