24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒకరి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్ఐ హెచ్.సాయిరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రైల్వే స్టేషన్ లో శనివారం డ్యూటీ లో ఉన్న సీబ్బంది ఒకటవ ప్లాట్ ఫార్మ్ మీద విధులు నిర్వస్తున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతు కన్పించడం తో సిబ్బందికి  అనుమానం వచ్చి అతనిని పట్టుకొని విచారించగా అతను నగరంలోని ద్వారకానగర్ కు చెందిన సయ్యద్ మాజీద్ గా గుర్తించారు. అతనివద్ద ఉన్న 3 మొబైల్ ఫోన్లు ట్రైన్లో దొంగ తనం చేసినవి అని గుర్తించారు. శనివారం కూడా ట్రైన్ లో దొంగ తనానికి వచ్చానని తెలిపారు. వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రిగింది. చాక చక్యంగా పట్టుకునున్న సిబ్బందిని హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుళ్లు గురూదాస్, రాములును అభినందించారు.

More articles

Latest article