28.2 C
Hyderabad

తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని ధోన్  పాల్ గ్రామంలో 1994  సంవత్సరంలో,, ఇందిరమ్మ పథకం కింద సర్వే నెంబర్ 222 లో 80 ప్లాట్లు మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చినారు. కానీ ఇంతవరకు ఎవరికి ప్లాట్లు చూపించలేకపోయారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకపోయినా పట్టించుకున్న దాఖలు లేవని ఇప్పటికైనా ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఆనాడు ఇచ్చిన 222 సర్వే నెంబర్ లో ఇల్లు కట్టి ఇవ్వాలని కోరుతూ సీపీఐఎంఎల్  మాస్ లైన్ (ప్రజాపంథా) ఎర్గట్ల మోర్తాడ్ సంయుక్త మండలలా కార్యదర్శి కిషన్ ఆధ్వర్యంలో  మోర్తాడ్ తాసిల్ ల్దార్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తిగుళ్ల గంగ పోసాని, తిగుళ్ల భూమ గంగు, జమున,సాయమ్మ , గుండ్ల లక్ష్మి, గుండ్ల బాజామ్మ , దూదేకుల మొగుల సాబ్, డోన్ పాల్ సాయమ్మ , ధోన్ పాల్ రాజు, ధోన్ పాల్ గంగాధర్, సురేష్, తిగుల్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article