27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తిరుపతి లో సాటాపూర్ కు చెందిన కుటుంబం అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

తిరుమలలో దైవ దర్శనంకు వెల్లిన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం కావడంతో కలకలం రేగింది. జూన్ 14న తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన మెగావత్ మోహన్, ఆయన భార్య లక్ష్మి, కూతురు శిరీషలు ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు.జూన్ 17న తిరుపతి నుండి తిరుగు ప్రయాణం అవుతున్నామని మోహన్ తన బామర్ది ఇస్లావత్ రవీందర్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. కానీ ఆ తర్వాత వారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఇంటికి రాకపోవడం బంధువుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఇస్లావత్ రవీందర్ రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రావెల్ హిస్టరీ, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా మోహన్ కుటుంబం చివరిసారిగా ఎక్కడ ఉన్నారన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా కుటుంబం ఆచూకీ లభించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

 

 

Family from Satapur goes missing in Tirupati

More articles

Latest article