వేములవాడ, బతుకమ్మ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వస్తి వాచకంతో స్వాగతం పలికారు. అనంతరం కల్యాణ మండపంలో వేదపండితుల చేతుల మీదుగా వేదోక్త ఆశీర్వాదాలు పొందారు. భక్తులు, అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధి విషయాలపై చర్చించారు.

