29 C
Hyderabad
Monday, August 3, 2026

మోక్ష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ బారికేడ్లు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోక్ష్ డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్ ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో 20 ట్రాఫిక్ బారికేడ్లను గురువారం అందజేశారు. ఈ సందర్భముగా ఏసిపి మాట్లాడుతూ బారికేడ్లను నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ను నియంత్రించడానికి, బందోబస్తులకు, రోడ్ పైన ఇతర అవసముల కొరకు ఉపయోగిస్తామని తెలిపారు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ మిగతా హాస్పిటల్స్ యాజమాన్యం, వ్యాపార యజమానులు ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వినోద్, శేఖర్, ఎస్ఐ రాహుమతుల్లా , ఆర్ఎస్ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

More articles

Latest article