29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై సొంత పార్టీలో తిరుగుబాటు

Must read

📰 Generate e-Paper Clip

త్వరలో కేసీఆర్‌ను కలుస్తాం : బీఆర్‌ఎస్‌ నాయకులు

బతుకమ్మ, నిజామాబాద్‌

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డిపై సొంత పార్టీలో నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. జీవన్‌రెడ్డి చర్యలతో ఆర్మూర్‌లో పార్టీ పతనమైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం నిజామాబాద్‌ నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ఓ అరాచకవాదిని, జీవన్‌ రెడ్డిని పార్టీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లలో చాలా అరాచకాలు జరిగాయని, బెదిరింపులు, భూకబ్జాలు, అక్రమ కేసులు పెట్టించి ప్రజలు, కార్యకర్తలను ముప్పు తిప్పలు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. జీవన్‌రెడ్డి పార్టీలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయయమని అన్నారు. ఆర్మూర్‌ ఇన్‌చార్జిని మార్చాలని కోరారు.

త్వరలో కేసీఆర్‌, కేటీఆర్‌లను కలుస్తాం..

ఆర్మూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అరాచకాలను కేసీఆర్‌, కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో వారిని కలవనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి సురేష్‌ వెల్లడిరచారు.

More articles

Latest article